అలసత్వం వీడకుంటే యువతకు పెనుముప్పే: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-08-01T13:49:21+05:30 IST

యువత నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తిని పెంచుతోందని, చాలా దేశాల్లో వారే వ్యాప్తిని నిర్దేశిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. వారు ఇకనైనా అలసత్వం వీడి జాగ్రత్తగా వ్యవహరించకుంటే పెనుముప్పు తప్పదని హెచ్చరించింది.

అలసత్వం వీడకుంటే యువతకు పెనుముప్పే: డబ్ల్యూహెచ్‌వో

యువత నిర్లక్ష్యం వల్లే వ్యాప్తి

జనీవా, జూలై 31: యువత నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తిని పెంచుతోందని, చాలా దేశాల్లో వారే వ్యాప్తిని నిర్దేశిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. వారు ఇకనైనా అలసత్వం వీడి జాగ్రత్తగా వ్యవహరించకుంటే పెనుముప్పు తప్పదని హెచ్చరించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన వర్చువల్‌ న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అఢనోమ్‌ ఘేబ్రియేసస్‌ మాట్లాడారు. ‘‘కరోనా.. ముసలివాళ్లకు, ఇతర జబ్బులతో బాధపడే వాళ్లకు మాత్రమే కాదు.. యువతకు కూడా ప్రాణాంతకమే. వారేమీ అజేయులు కారు. వారికీ ముప్పు పొంచి ఉంది’’ అని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిలో నైట్‌క్లబ్‌ల పాత్ర అధకమన్నారు.


Updated Date - 2020-08-01T13:49:21+05:30 IST