ట్రంప్ ఫొటోలను విడుదల చేసిన శ్వేతసౌధం!
ABN , First Publish Date - 2020-10-04T22:52:20+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన రెండు ఫొటోలను శనివారం రోజు వైట్‌హౌస్ సోషల్ మీడియాలో విడుదల చేసిం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన రెండు ఫొటోలను శనివారం రోజు వైట్‌హౌస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. శ్వేతసౌధం విడుదల చేసిన ఫొటోలోని దృశ్యాల ప్రకారం.. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కొన్ని పత్రాలను పరిశీలించడాన్ని.. ఫొటోల్లో చూడవచ్చు. కాగా.. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. తనకు వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే ట్రంప్.. శ్వేతసౌధంలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో చేరారు. ప్రస్తుతం మిలటరీ ఆసుపత్రిలోనే ట్రంప్ కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు రెమిడిసివిర్ థెరఫీ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందంటూ కొన్ని వార్తలు వొచ్చాయి. ఇదే సమయంలో ట్రంప్.. తాను బాగానే ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలోనే వైట్‌హౌస్.. ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. అయితే ట్రంప్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు, ఆరోగ్య పరిస్థితిపై వార్తలు.. గంటల వ్యవధిలో బయటికి రావడంతో ఆయన ప్రస్తుత ఆరోగ్య స్థితిపై గందరగోళం నెలకొంది.