ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేసిన వైట్‌హౌస్ వైద్యులు!
ABN , First Publish Date - 2020-10-03T21:48:38+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థిని, అతనికి అందిస్తున్న వైద్యం గురించి అందులో పేర్కొ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థిని, అతనికి అందిస్తున్న వైద్యం గురించి అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్.. ఆయన సతీమణి కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. అయితే తానకు వైరస్ సోకిందని తెలిసిన తర్వాత.. వైట్‌హౌస్‌లో ట్రంప్ స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మిలటరీ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ట్రంప్‌కు వైరస్ సోకిందని తెలసి, ఆయన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్వేతసౌదం వైద్యులు ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. అందులో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. అంతేకాకుండా మహమ్మారి నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవడానికి.. రెమ్‌డెసివిర్ థెరపీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని.. ట్రంప్ కోలుకుంటున్నారని తెలిపారు.