ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. స్పందించిన వైట్‌హౌస్!

ABN , First Publish Date - 2020-10-24T14:22:03+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వచ్చిన మీడియా కథనాలను వైట్‌హౌస్, ట్విట్టర్ వేరు వేరు ప్రకటనల్లో తోసిపుచ్చాయి. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదని

ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. స్పందించిన వైట్‌హౌస్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వచ్చిన మీడియా కథనాలను వైట్‌హౌస్, ట్విట్టర్ వేరు వేరు ప్రకటనల్లో తోసిపుచ్చాయి. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదని స్పష్టం చేశాయి. వివరాల్లోకి వెళితే.. డచ్ సైబర్ సెక్యూరిటీ రీసర్చర్ విక్టర్ గేవర్స్.. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు ప్రకటించారు. ఐదో ప్రయత్నంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌లోకి లాగిన్ అయినట్లు చెప్పారు. అయితే అకౌంట్ హ్యాక్ అయిన కొద్ది సమయంలోనే వైట్‌హౌస్ అధికారులు పాస్‌వర్డ్‌ను మార్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మీడియా కథనాలను వెలువరించింది. దీనిపై వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ట్విట్టర్ కూడా ఆ వార్తలను తోసిపుచ్చింది. 


Updated Date - 2020-10-24T14:22:03+05:30 IST