ప్రపంచ మహమ్మారి (పాండమిక్) అంటే..?
ABN , First Publish Date - 2020-03-13T14:35:24+05:30 IST
కరోనా వైర్‌సను ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అసలు దీని అర్థం ఏంటి?

కరోనా వైర్‌సను ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అసలు దీని అర్థం ఏంటి? ఏ వ్యాధైనా అనేక దేశాల్లో (ప్రపంచవ్యాప్తంగా) ఒక వ్యక్తి నుంచి మరొకరికి ఒకే సమయంలో సోకినపుడు దాన్ని పాండమిక్ అంటారు. సాధారణంగా ఈ పాండమిక్ కింద కొత్త వైర్‌సలు వ్యక్తుల నుంచి వేరొకరికి చాలా సులువుగా సోకుతుంటాయి. వాటిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కరోనాను ఎదుర్కొనడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లూ లేవు. అందుకే దీన్ని నిరోధించడమే మార్గాంతరం.