మాస్క్ ధరించకుంటే.. రూ.12.25లక్షల జరిమానా..!

ABN , First Publish Date - 2020-05-18T19:36:00+05:30 IST

కరోనా కట్టడికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను.. పాటించని ప్రజలపై కఠి

మాస్క్ ధరించకుంటే.. రూ.12.25లక్షల జరిమానా..!

కువైట్: కరోనా కట్టడికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను.. పాటించని ప్రజలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కాగా.. సామాజిక దూరం పాటించడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు మాస్కులను ధరించడాన్ని ఖతార్ ఇప్పటికే తప్పనిసరి చేసింది. ఒకవేళ ముఖానికి మాస్కు వేసుకోకుండా ఇంటి నుంచి బయటికి వస్తే.. 200,000 రియాల్స్ (సుమారు రూ.42లక్షలు) జరిమానాతో పాటు మూడేళ్లపాటు జైలుకు పంపనున్నట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా కువైట్‌ కూడా ఖతార్ బాటలోనే అడుగులు వేస్తోంది. ప్రజలు మాస్కులు లేకుండా బయటికొస్తే.. 5000 దినార్ల (సుమారు రూ. 12.25లక్షల) జరిమానా గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా.. కువైట్‌లో ఆదివారం  ఒక్కరోజే 1048 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 250 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. ఐదుగురు మరణించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు కువైట్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 14,850కి చేరింది. మరణించిన వారి సంఖ్య 112కు చేరింది. 

Updated Date - 2020-05-18T19:36:00+05:30 IST