భారత బ్యాంకులకు విజయ్ మాల్యా భారీ ఆఫర్ !
ABN , First Publish Date - 2020-07-18T14:18:00+05:30 IST
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దారికొస్తున్నాడు.

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దారికొస్తున్నాడు. తనపై నమోదైన కేసులు మూసేసేందుకు భారత్‌లోని బ్యాంకులకు రుణ బకాయిల కింద రూ.13,960 కోట్లు చెల్లించేందుకు సిద్ధమని మాల్యా తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలిపినట్టు సమాచారం. తనను భారత్‌కు అప్పగించాలన్న కేసు లండన్ కోర్టులో తుది విచారణ దశకు వస్తున్న సమయంలో మాల్యా ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని మాల్యా భావించి ఈ మొత్తం చెల్లించేందుకు సిద్ధపడినట్టు భావిస్తున్నారు. అయితే మాల్యా ముందుగా ఆ డబ్బులు డిపాజిట్ చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. గతంలోనూ మాల్యా ఇలా నే ఉత్తుత్తి ఆఫర్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.