కరోనా దెబ్బతో కొడుకుని దూరం పెట్టిన తండ్రి..వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-03-29T21:55:17+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటి వరకు సుమారు 6 మిలియన్ల మంది వీక్షించారు. ఇంతకీ అది ఏం వీడియో.. ఎందుకు

కరోనా దెబ్బతో కొడుకుని దూరం పెట్టిన తండ్రి..వీడియో వైరల్

రియాద్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటి వరకు సుమారు 6 మిలియన్ల మంది వీక్షించారు. ఇంతకీ అది ఏం వీడియో.. ఎందుకు అంత మంది దాన్ని వీక్షించారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. వీడియోలోని దృశ్యాల ప్రకారం..  తలుపులు తెరిచి ఇంట్లోకి వస్తున్న తండ్రిని.. సుమారు నాలుగేళ్లు వయసు ఉన్న కుమారుడు గమనిస్తాడు. తండ్రిని చూసిన ఆనందంలో.. ‘నాన్నా’ (అరబ్‌లో) అనుకుంటూ తండ్రి ఒడిలో వాలిపోవాలనుకుని చెంగుచెంగున పరిగెత్తాడు. అయితే ఆ చిన్నోడికి నిరాశే ఎదురైంది. కుమారుడ్ని ఆ తండ్రి దగ్గరకు తీసుకోలేదు సరికదా.. వెనక్కు జరుగుతూ దగ్గరికి రావొద్దంటూ హెచ్చరించాడు. తండ్రి నోట ఆ మాటలు రావడంతో.. ఆ చిన్నోడు నిశ్శబ్దంగా పక్కకు వెళ్లిపోతాడు. అయితే కొడుకు ముఖంలో అయోమయాన్ని గమనించిన ఆ తండ్రి.. తన పరిస్థిని తలచుకుని బాధపడుతాడు. ఇదీ ఆ వీడియో సారాంశం. కొడుకుని దగ్గరకొస్తుంటే.. రావొద్దనడం ఎందుకు.. ఆ తర్వాత మళ్లీ బాధపడటం ఎందుకనేగా మీ సందేహం.


ఆ తండ్రి అలా ప్రవర్తించడానికీ ఓ కారణం ఉంది. అది ఏంటంటే.. ఆ తండ్రి ఓ వైద్యుడు. ఆస్పత్రిలో కరోనా బారినపడిన వారికి చికిత్స చేస్తాడు. అందువల్ల వైరస్ తన కుమారుడికి ఎక్కడ సోకుతుందో అనే భయంతో.. అతను ఆ నాలుగేళ్ల చిన్నోడిని దగ్గరకు రానివ్వలేదు. అయితే ఇటువంటి పరిస్థితిని ఆ ఒక్క డాక్టర్ మాత్రమే ఎదుర్కొవడం లేదు. ఆగ్రరాజ్యాలను సైతం సతమతం చేస్తున్న వైరస్‌తో ప్రతి రోజు యుద్ధం చేస్తున్న అందరి డాక్టర్ల పరిస్థితీ ఇదే. హాస్పటల్ నుంచి ఇంటికెళ్లిన తర్వాత కన్నబిడ్డలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేని ప్రతి డాక్టర్‌ ఆవేదనకు ఈ వీడియోలోని దృశ్యాలు అద్దం పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ వీడియోలో ఉన్న డాక్టర్ పేరు నసీర్ అలీ. అతను సౌదీలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తాడు. అయితే కరోనా ఎంత ప్రమాదకరమో ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఆ వీడియోను చిత్రీకరించినట్లు స్థానిక మీడియాకు వివరించాడు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 31వేల మంది మరణించారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Updated Date - 2020-03-29T21:55:17+05:30 IST