ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-07-27T18:21:03+05:30 IST

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ.. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి అధ్వర్యంలో.. వివిధ దేశాలలోని 100 కి పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో మొ

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ.. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి అధ్వర్యంలో.. వివిధ దేశాలలోని 100 కి పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో మొదలుపెట్టిన "ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం" అట్టహాసంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రారంభమైంది.  పూర్తిగా వర్చువల్ పద్ధతిలో వెబ్-ఎక్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, లావు కృష్ణ దేవరాయులు, ఆంధ్రప్రదేష్ ప్రభుత్వపు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఆంధ్రప్రదేష్ మాజీ ఉప శాసనసభాపతి మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ శాసన సభ్యులు రసమయి బాలకృష్ణ, సెంట్రల్ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస రావు, డాక్టర్ ఓలేటి పార్వతీశం, ఏపి.ఎన్నార్టీ.ఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి అతిథులుగా పాల్గొని  ప్రసంగించారు.


20రోజులపాటు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగగా దాదాపు 18,000 మంది అభ్యర్దులు 40 కి పైగా దేశాల నుంచి వివిధ పోటీల్లో పాల్గొనటానికి దరఖాస్తు చేసుకున్నారు.  జులై 24, 25 మరియు 26 తేదీల్లో జరిగిన ఈ పోటల్లో 500 మంది పైగా కోఆర్డినేటర్లు, దాదాపు 600 మంది న్యాయనిర్ణేతలు పాల్గొన్నట్లు కన్వినర్ తూనుగుంట్ల శిరీష తెలిపారు.   జాతీయగీతం ఆలపించటంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్త్రధారణను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. పంచెకట్టు తెలుగు తనానికి నిదర్శనమన్నారు.


డిజిటల్ వేదికపై జరిగిన ఈ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..  తెలుగు భాషా, సంస్కృతులను కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తానా అధ్యక్షులు జయ తాళ్ళూరి, సమన్వయకర్త  తూనుగుంట్ల శిరీషను ఉపరాష్ట్రపతి అభినందించారు.   ఈ కార్యక్రమాన్ని మహోత్సవం అనేకంటే తిరునాళ్లు అంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను ప్రవాసాంధ్రులు అందరూ కలిసి చెసుకోవాలని అకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.ఎం.రమేష్, గల్లా జయదేవ్, లావు కృష్ణదేవరాయులు, రసమయి బాలకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మందలి బుద్ద ప్రసాద్, ఏ.పి.ఎన్నర్టి.ఎస్.అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి గార్లు మాత్లాడుతూ నిర్వాహుకులను అభినందించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనటంపట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ రూపకర్త విజయ భాస్కర్, ప్రధాన పాత్ర పోషించిన జైహో భారతీయం శ్రీనివాస్ రెడ్డి, జిగ్నాస భార్గవ్ మరియు కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల తెలుగు సంఘాల వారికి తూనుగుంట్ల శిరీష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Updated Date - 2020-07-27T18:21:03+05:30 IST