వందే భారత్ మిషన్: కువైట్, బహ్రెయిన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానాలు

ABN , First Publish Date - 2020-06-23T00:53:11+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా కువైట్, బహ్రెయిన్‌ల నుంచి రెండు ప్రత్యేక విమానాలు

వందే భారత్ మిషన్: కువైట్, బహ్రెయిన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానాలు

కువైట్: వందే భారత్ మిషన్‌లో భాగంగా కువైట్, బహ్రెయిన్‌ల నుంచి రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కు బయలుదేరాయి. బహ్రెయిన్ నుంచి బయలుదేరిన విమానంలో మొత్తం 176 మంది భారతీయులు ఉండగా.. కువైట్ నుంచి బయలుదేరిన విమానంలో 177 మంది భారతీయులున్నారు. బహ్రెయిన్, కువైట్‌ల నుంచి వస్తున్న ఈ రెండు విమానాలు కూడా చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నాయి. బహ్రెయిన్ నుంచి భారత్ వస్తున్న ఏఐ 1890 విమానంలో ముగ్గురు పసిపిల్లలు కూడా ఉన్నట్టు ఇండియన్ ఎంబసి తెలిపింది. కాగా.. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటివరకు 2,50,087 మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటికే ఈ మిషన్‌లో రెండు విడతలు పూర్తి కాగా.. జూన్ 10 నుంచి మూడో విడత ప్రారంభమైంది. జూన్ 30 వరకు కొనసాగనున్న మూడో విడతలో మొత్తంగా 550 విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తీసుకురానుంది.  

Updated Date - 2020-06-23T00:53:11+05:30 IST