శీతలీకరణ లేకుండానే టీకా నిల్వ
ABN , First Publish Date - 2020-11-13T10:54:25+05:30 IST
శీతలీకరణ (రిఫ్రిజరేషన్) అవసరం లేకుండా.. ప్రొటీన్ల ద్వారా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే టీకాలను నిల్వ చేసే పద్ధతిని రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులోభాగంగా శాస్త్రవేత్తలు.. ధన లేదా రుణ
వాషింగ్టన్, నవంబరు 12: శీతలీకరణ (రిఫ్రిజరేషన్) అవసరం లేకుండా.. ప్రొటీన్ల ద్వారా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే టీకాలను నిల్వ చేసే పద్ధతిని రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులోభాగంగా శాస్త్రవేత్తలు.. ధన లేదా రుణ (పాజిటివ్-నెగెటివ్) ఆవేశాలు కలిగిన సింథటిక్ ప్రొటీన్లను కలిపి ఒక ద్రావణంలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ‘కాంప్లెక్స్ కోక్జర్వేషన్‌గా పేర్కొన్నారు. ఈ మిశ్రమం.. వైరస్ ఉపరితలం చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తుంది. తద్వారా శీతలీకరణ అవసరం లేకుండానే టీకాలను నిల్వ ఉంచే వీలుంటుంది. వాస్తవానికి 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య టీకాలను రవాణా చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు శీతలీకరణ ప్రమాణాలు పాటించకపోతుండటంతో ఏటా సగం టీకాలు వృథా అవుతున్నాయి. కొత్త పద్ధతి ద్వారా రవాణా, నిల్వ సందర్భంగా వృథాను అరికట్టే వీలు కలగనుంది. ఈ పరిశీలనలో అమెరికాలోని ప్రఖ్యాత మిచిగన్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.