ఫైజర్‌ వ్యాక్సిన్‌.. దేశానికొక ధర

ABN , First Publish Date - 2020-12-10T10:28:16+05:30 IST

ఫైజర్‌ వ్యాక్సిన్‌ ధర ఒక్కో దేశంలో ఒక్కోలా ఉం టుందని ఆ కంపెనీ చైర్మన్‌, సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. ఈ రేటును ఆయా దేశాల

ఫైజర్‌ వ్యాక్సిన్‌.. దేశానికొక ధర

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఫైజర్‌ వ్యాక్సిన్‌ ధర ఒక్కో దేశంలో ఒక్కోలా ఉం టుందని ఆ కంపెనీ చైర్మన్‌, సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. ఈ రేటును ఆయా దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ), అక్కడి ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. మధ్య, అల్ప ఆదాయ దేశాల్లో వ్యాక్సిన్‌ రేటు తక్కువగానే ఉంటుందని తెలిపారు. అమెరికాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ ధరను రూ.1440 (19.50 డాలర్లు)గా నిర్ణయించామని, ఇది సగటు అమెరికన్‌ ఒకపూట భోజనం ఖర్చుతో సమానమన్నారు. విదేశాల నుంచి ఆర్డర్లు వస్తే డోసులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

Updated Date - 2020-12-10T10:28:16+05:30 IST