భారత్‌-చైనా మధ్యవర్తిత్వ ఆలోచన లేదు: అమెరికా

ABN , First Publish Date - 2020-06-19T13:46:38+05:30 IST

భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆ రెండు దేశాలకు మధ్యవర్తిత్వం చేసే అధికారిక ప్రణాళికలేవీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రస్తుతం లేవని వైట్‌హౌస్‌ ప్రతినిధి కైలీ మెక్‌నానీ స్పష్టం చేశారు.

భారత్‌-చైనా మధ్యవర్తిత్వ ఆలోచన లేదు: అమెరికా

వాషింగ్టన్‌, జూన్‌ 18: భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆ రెండు దేశాలకు మధ్యవర్తిత్వం చేసే అధికారిక ప్రణాళికలేవీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రస్తుతం లేవని వైట్‌హౌస్‌ ప్రతినిధి కైలీ మెక్‌నానీ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై ట్రంప్‌కు అవగాహన ఉందని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, ట్రంప్‌ ఈ నెల 2న ఫోనులో మాట్లాడుకున్నారని మెక్‌నానీ నిర్ధారించారు. లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.


Updated Date - 2020-06-19T13:46:38+05:30 IST