భారత ఐటీ నిపుణులకు షాక్.. హెచ్1బీ వీసా రూల్స్ మార్చిన అమెరికా!

ABN , First Publish Date - 2020-10-07T23:01:39+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడిన వేళ.. అమెరికన్లకు లబ్ధి చేకూర్చే విధంగా, భారతకు చెందిన నిపుణులకు నష్టం కలిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసా విధానంలో ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ

భారత ఐటీ నిపుణులకు షాక్.. హెచ్1బీ వీసా రూల్స్ మార్చిన అమెరికా!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడిన వేళ.. అమెరికన్లకు లబ్ధి చేకూర్చే విధంగా, భారత్‌కు చెందిన నిపుణులకు నష్టం కలిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసా విధానంలో ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకనటలో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం అమెరికన్ సంస్థల్లో ఏటా అత్యధికంగా అత్యంత నైపుణ్యం గల 85వేల మంది విదేశీ నిపుణులను మాత్రమే నియమించుకోవడానికి వీలుంటుందని తెలిపింది. హెచ్1బీ వీసా విధానంలో తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ పూర్తిగా వెల్లడించలేదు. కానీ.. ‘ప్రత్యేక నైపుణ్యాల’కు ఉన్న నిర్వచనాన్ని తగ్గించినట్లు పేర్కొంది. దీంతో హెచ్1బీ వీసా పరిధిలోకి వచ్చే ‘ప్రత్యేక నైపుణ్యాల’ సంఖ్య తగ్గనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొత్త నిబంధనలు త్వరలోని అమలులోకి వస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ స్పష్టం చేసింది. కాగా.. తాము ఆర్థిక భద్రతను దేశ భద్రతలో భాగంగా భావించే యుగంలోకి ప్రవేశించినట్లు హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చాడ్ వోల్ఫ్ తెలిపారు. అంతేకాకుండా ‘ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత. అమెరికన్‌లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తొలి ప్రాధ్యన్యం లభించేలా మన చట్ట పరిధిలో చేయగలిందంతా చేయాలి’ అని అన్నారు.


కాగా.. హెచ్1బీ, హెచ్2బీ తదితర ఉద్యోగ, ఉపాధి ఆధారిత వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం జూన్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో కొన్ని దిగ్గజ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వీసాల జారీపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఎత్తేయాలంటూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్.. హెచ్1బీ విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. ట్రంప్ నిర్ణయం భారతీయులకు నష్టం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ట్రంప్ నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించలేవు అని అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2020-10-07T23:01:39+05:30 IST