161మంది అక్రమ వలసదారులను ఇండియాకు తరలించనున్న అమెరికా!

ABN , First Publish Date - 2020-05-18T20:29:28+05:30 IST

అమెరికాలో అక్రమంగా చొరబడ్డ 161 మంది భారతీయ వలప కార్మికులను తిరిగి ఇండియాకు పంపేందుకు అమెరికా రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక విమానంలో

161మంది అక్రమ వలసదారులను ఇండియాకు తరలించనున్న అమెరికా!

వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా చొరబడ్డ 161 మంది భారతీయ వలప కార్మికులను తిరిగి ఇండియాకు పంపేందుకు అమెరికా రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక విమానంలో వీరిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించనున్నట్లు యూఎస్ అధికార వర్గాలు ప్రకటించాయి. 161 మందిలో చాలా వరకు మెక్సికో ద్వారా యూఎస్‌లోకి చొరబడ్డ వారున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సాత్నామ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన దాదాపు 1739 మంది భారతీయులు .. యూఎస్ వ్యాప్తంగా 95జైళ్లలో ఉన్నారని తెలిపారు. ఈ 161 మంది కూడా ఇందులో భాగమే అన్నారు. జైళ్లలో ఉన్న 1739 మందిని దశల వారీగా ఇండియాకు తరలించాలని అమెరికా నిర్ణయించిదన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 161 మందిని మే 19న ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. 161 మందిలో 76 మంది హర్యానాకు చెందిన వారు ఉండగా.. తెలంగాణకు చెందిన వారు ఇద్దరు, ఏపీకి చెందిన వారు ఒకరు ఉన్నారని ఆయన తెలిపారు. 


Updated Date - 2020-05-18T20:29:28+05:30 IST