చైనా విమాన సర్వీసులను నిలిపివేస్తున్న అమెరికా

ABN , First Publish Date - 2020-06-04T13:46:57+05:30 IST

అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరంగానే కాకుండా విమానాల రాకపోకలకు సంబంధించిన ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

చైనా విమాన సర్వీసులను నిలిపివేస్తున్న అమెరికా

వాషింగ్టన్‌, మే 3: అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరంగానే కాకుండా విమానాల రాకపోకలకు సంబంధించిన ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. జూన్‌ 16 నుంచి అమెరికాకు వచ్చి వెళ్లే నాలుగు చైనా ఎయిర్‌లైన్స్‌ షెడ్యూల్డ్‌ ప్యాసెంజర్‌ విమానాలను నిలిపివేయనున్నట్టు అమెరికా పాలన యంత్రాంగం బుధవారం తెలిపింది. ఈ వారంలో చైనాకు విమాన సర్వీసులు పునరుద్ధరించాలని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ నిర్ణయించాయి. అయితే అనుమతులు ఇవ్వడంలో చైనా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే చైనా ఎయిర్‌లైన్స్‌పై చర్య తీసుకుంటున్నట్టు అమెరికా రవాణా విభాగం తెలిపింది. విమాన సర్వీసులకు సంబంధించి ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అయితే ద్వైపాక్షిక హక్కులను సద్వినియోగపరచుకోవడానికి చైనాతో కలిపి పని చేయనున్నట్టు తెలిపింది. 

Updated Date - 2020-06-04T13:46:57+05:30 IST