వైరల్ వీడియో.. హిందీ శ్లోకాన్ని ఆలపించిన అమెరికన్ సింగర్!
ABN , First Publish Date - 2020-11-13T22:43:55+05:30 IST
అమెరికాకు చెందిన ప్రముఖ నటి, సింగర్ మేరీ మిల్బెన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యా
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ నటి, సింగర్ మేరీ మిల్బెన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు మేరీ మిల్బెన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ‘ఓమ్ జై జగదీశ హరే’ అనే హిందీ శ్లోకాన్ని ఆలపించిన వీడియోను అమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో లెహెంగా డ్రెస్‌లో మేరీ మిల్బెబ్ తలుక్కుమన్నారు. అంతేకాకుండా.. ‘ఓమ్ జై జగదీశ హరే.. అనే అందమైన హిందీ శ్లోకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దీపావళి రోజున తమ ఇళ్లలో ఆలపిస్తారు. ఈ శ్లోకం నా హృదయాన్ని తాకి.. భారతీయ సంప్రదాయాల వైపునకు నన్ను అడుగులు వేసేలా చేసింది’ అంటూ పేర్కొన్నారు. కాగా.. ఆమె వీడియోను చూసి స్పందిస్తున్న నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ జాతీయ గీతాన్ని కూడా ఆమె ఆలిపించారు. అప్పట్లో ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది.