ప్లీజ్.. అలా చేయకండి: దేశ ప్రజలకు బైడెన్ విజ్ఞప్తి!

ABN , First Publish Date - 2020-12-03T22:38:35+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.

ప్లీజ్.. అలా చేయకండి: దేశ ప్రజలకు బైడెన్ విజ్ఞప్తి!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, ఇతర సెలవుల సందర్భంగా ప్రజలు విచ్చిలవిడిగా ప్రయాణాలు చేయొద్దని విన్నవించారు. బుధవారం వాల్మింగ్టన్‌లో కొవిడ్ ప్రభావం వల్ల నష్టపోయిన చిన్న వ్యాపార వేత్తలు, వర్కర్స్‌తో వర్చువల్‌గా భేటీ అయిన బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. "క్రిస్మస్ సందర్భంగా భారీగా సెలవులు రాబోతున్నాయి. దీంతో ప్రజలు వేరే ప్రాంతాలకు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం సాధారణం. కానీ, ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఇంటిపట్టునే ఉండండి. ఈసారి పండుగ ఎవరి ఇంట్లో వారే చేసుకోవడం బెటర్. ప్రయాణాలకు దూరంగా ఉండండి." అని బైడెన్ కోరారు.


ఇక థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్ తర్వాత అమెరికా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న విషయం తెలిసిందే. జనాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విచ్చలవిడిగా ప్రయాణాలు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలిసింది. ఈ నేపథ్యంలోనే బైడెన్ రాబోయే హాలీడేస్‌ సందర్భంగా ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.50 లక్షల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.80 లక్షల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుందని, వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనుక అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలను కోరారు. 

Updated Date - 2020-12-03T22:38:35+05:30 IST