డొనాల్డ్ ట్రంప్ నిశితంగా గమనిస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-06-18T21:16:50+05:30 IST

భారత్-చైనా మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల మధ్య ఏర్పడిన పరిస్థితులను పర్యవేక్షిస్తు

డొనాల్డ్ ట్రంప్ నిశితంగా గమనిస్తున్నారు..!

వాషింగ్టన్: భారత్-చైనా మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల మధ్య ఏర్పడిన పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్వేతసౌధం ప్రతినిధి కైలీ మెకెననీ.. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు సంతాపాన్ని ప్రకటించారు. అంతేకాకుండా భారత్-చైనా దేశాల మధ్య ఏర్పడిన పరిస్థితులను  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిశితంగా గమనిస్తునారని ఆమె పేర్కొన్నారు. భారత్-చైనాల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించడానికి ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అమె బదులిచ్చారు. ప్రస్తుతం అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే భారత్-చైనా సరిహద్దు అంశంపై జూన్ 2న ఫోన్ సంభషణ ద్వారా మోదీ.. ట్రంప్ చర్చించారని వివరించారు.  


Updated Date - 2020-06-18T21:16:50+05:30 IST