‘మోడెర్నా’కు అమెరికా గ్రీన్ సిగ్నల్ !
ABN , First Publish Date - 2020-12-19T12:55:39+05:30 IST
అనుకున్నట్టే జరిగింది. ఫైజర్ వ్యాక్సిన్ తరహాలోనే.. మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కు కూడా అమెరికా ప్రభు త్వం శుక్రవారం పచ్చజెండా ఊపింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సిఫారసు చేస్తూ ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన సానుకూల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అమెరికాలో ‘మోడెర్నా’కు అత్యవసర ఆమోదం
వాషింగ్టన్, డిసెంబరు 18 : అనుకున్నట్టే జరిగింది. ఫైజర్ వ్యాక్సిన్ తరహాలోనే.. మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కు కూడా అమెరికా ప్రభు త్వం శుక్రవారం పచ్చజెండా ఊపింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సిఫారసు చేస్తూ ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన సానుకూల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అమెరికాలో ఒకే వారంలో రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరైనట్లు అయింది. అంతకుముందు రోజు(గురువారం) వైద్య, వ్యాక్సిన్ రంగాలకు చెందిన స్వతంత్ర నిపుణులతో కూడిన వ్యాక్సి న్స్ అండ్ రిలేటెడ్ బయొలాజికల్ ప్రోడక్ట్స్ అడ్వైజరీ కమిటీ(వీఆర్‌బీపీఏసీ) మోడెర్నా టీకాను 20-0 ఓట్లతో ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ పురోగతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. మోడెర్నా వ్యాక్సిన్ పంపిణీ త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య శుక్రవారం ఫైజర్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు.