లగేజీ సర్దుకునే పనిలో బిజీగా ఉన్న మెలానియా ట్రంప్!

ABN , First Publish Date - 2020-12-11T04:06:44+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన భార్య మెలానియా ట్రంప్.. విడాకులు ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటికి మరింత బలాన్ని చేకూ

లగేజీ సర్దుకునే పనిలో బిజీగా ఉన్న మెలానియా ట్రంప్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన భార్య మెలానియా ట్రంప్.. విడాకులు ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటికి మరింత బలాన్ని చేకూర్చే ఓ వార్త బయటికొచ్చింది. ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారట. ప్రస్తుతం తన వ్యక్తిగత సామాగ్రిని అక్కడికి తరలించేందుకు పనిలో ఆమె బిజీగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రథమ మహిళగా వైట్‌హౌస్‌లో ఆమె పొందిన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట. బొమ్మలతో కూడిన  బుక్‌ను రాసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. బైడెన్ గెలిచినప్పటికీ ట్రంప్ మాత్రం ఆయన ఓటమిని అంగీకరించడం లేదు. 


Updated Date - 2020-12-11T04:06:44+05:30 IST