అమెరికా పౌరులకు కీలక సూచనలు..!

ABN , First Publish Date - 2020-03-26T02:54:49+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం..

అమెరికా పౌరులకు కీలక సూచనలు..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం.. ఏప్రిల్ 15 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో అమెరికా పౌరుల కోసం భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యలయం కీలక సూచనలు చేసింది. భారత్‌లో ఉన్న యూస్ పౌరులు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉండాలనీ.. అధికారుల ఆదేశాలను పాటించాలని సూచింది. ఇండియాలో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానంలో అమెరికాకు తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన తర్వాత సురక్షితంగా ఇక్కడి నుంచి తరలించేందుకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నట్లు పేర్కొంది. వసతి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. 


Read more