బయటపడ్డ మోడెర్నా టీకా సైడ్ ఎఫెక్ట్ !

ABN , First Publish Date - 2020-12-26T18:53:00+05:30 IST

మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైద్యుడు తీవ్రమైన అలెర్జీ సమస్యతో బాధపడ్డారని సమాచారం.

బయటపడ్డ మోడెర్నా టీకా సైడ్ ఎఫెక్ట్ !

అమెరికా వైద్యుడికి తీవ్ర అలెర్జీ !

బోస్టన్: మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైద్యుడు తీవ్రమైన అలెర్జీ సమస్యతో బాధపడ్డారని సమాచారం. టీకా తీసుకున్న కొద్దిసేపటికే వైద్యుడికి అలెర్జీ సమస్య తలెత్తినట్టు అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం తన కథనంలో పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బోస్టన్ మెడికల్ సెంటర్‌లో జెరియాట్రిక్ ఆంకాలజీలో పనిచేసే డా. హుస్సేన్ సదర్జాదే గురువారం మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే, టీకా తీసుకున్న కొద్దిసేపటికే మైకంగా అనిపించడంతో పాటు హృదయ స్పందనలో వేగంగా మార్పు రావడం వంటి సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక వారంలో రోజు కింద దేశవ్యాప్తంగా మోడెర్నా వ్యాక్సినేషన్ ప్రారంభించిన అమెరికాలో ఇలా అలెర్జీ సమస్య వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. కాగా, అలెర్జీతో బాధపడ్డ సర్జాదేను వెంటనే ఎమర్జెన్సీ విభాగానికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నట్లు బోస్టన్ మెడికల్ సెంటర్ ప్రతినిధి డేవిడ్ కిబ్బే వెల్లడించారు. 

Updated Date - 2020-12-26T18:53:00+05:30 IST