శాంతా క్లాజ్ తప్పక వస్తాడు.. పిల్లలకు మాటిచ్చిన ఫౌచీ!

ABN , First Publish Date - 2020-12-21T02:49:53+05:30 IST

క్రిస్మస్ వేడుకల సందర్భంగా సాధారణంగా అమెరికాలో చిన్న పిల్లలు శాంతా క్లాజ్‌ల గురించి వేయి కళ్లతో ఎదురు చూస్తారు. క్రిస్మస్ తాత వస్తాడని.. ఎన్నో బహుమతులు ఇస్తాడని ఆశపడుతారు. అయితే అమెరికాలో కొ

శాంతా క్లాజ్ తప్పక వస్తాడు.. పిల్లలకు మాటిచ్చిన ఫౌచీ!

వాషింగ్టన్: క్రిస్మస్ వేడుకల సందర్భంగా సాధారణంగా అమెరికాలో చిన్న పిల్లలు శాంతా క్లాజ్‌ల గురించి వేయి కళ్లతో ఎదురు చూస్తారు. క్రిస్మస్ తాత వస్తాడని.. ఎన్నో బహుమతులు ఇస్తాడని ఆశపడుతారు. అయితే అమెరికాలో కొవిడ్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది.. క్రిస్మస్ తాత వస్తాడో.. రాడో అని పిల్లలు బెంగ పడుతున్నారు. ఇదే విషయాన్ని ఓ చిన్నారి అమెరికా ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడైన ఆంథోనీ ఫౌచీని అడిగేసింది. దీంతో స్పందించిన ఆయన ఆ చిట్టితల్లికి ధైర్యం చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ఆంథోనీ ఫౌచీ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా అక్కడున్న ఓ పాప.. కరోనా నేపథ్యంలో డిసెంబర్ 25న శాంతా క్లాజ్ తమ ఇంటికి రావడానికి వీలవుతుందా? అని అమాయకంగా ఫౌచీని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఆయన.. ‘తప్పకుండా వస్తాడు. మీ ఇంటి చిమ్మీ నుంచి శాంతా క్లాజ్ వచ్చి.. బహుమతులను వదిలి వెలతాడు. దీని గురించి నువ్వు వర్రీ అవ్వకు. మీరంతా క్రిస్మస్ తాత గురించి బెంగ పెట్టుకున్నారని నాకు తెలుసు. అందుకే నేనే స్వయంగా వెళ్లి దక్షిణ ధ్రువం వైపు వెళ్లి శాంతా క్లాజ్‌కు వ్యాక్సిన్ ఇచ్చి వచ్చాను. వారి రోగ నిరోధక శక్తిని కూడా పరీక్షించాను’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 1.70కోట్ల మంది కొవిడ్ బారినపడగా.. 3.10లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-12-21T02:49:53+05:30 IST