కస్టమర్ వెరైటీ సూచన.. షాకిచ్చిన అమెజాన్ డెలివరి మహిళ.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-06-26T05:35:23+05:30 IST

ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో వస్తువులు కొనే సమయంలో అదనపు సూచనలు(అడిషనల్ ఇన్‌స్ట్రక్షన్స్) అనే ఆప్షన్ ఉంటుంది.

కస్టమర్ వెరైటీ సూచన.. షాకిచ్చిన అమెజాన్ డెలివరి మహిళ.. అమెరికాలో..

డోవర్: ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో వస్తువులు కొనే సమయంలో అదనపు సూచనలు(అడిషనల్ ఇన్‌స్ట్రక్షన్స్) అనే ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా ఆయా సంస్థలు తప్పకుండా ప్రత్యేక సూచనల గురించి అడుగుతున్నాయి. సహజంగా ప్రతిఒక్కరు డెలివరీకి సంబంధించి లేదా అడ్రస్‌కు సంబంధించి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే అమెరికాలోని డెలవేర్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు మాత్రం అమెజాన్‌లో తాను ఆర్డర్ చేసిన వస్తువుతో పాటు వెరైటీ సూచన చేశాడు. అదేంటంటే.. ‘ఆర్డర్ డెలివరి చేసి తలుపును మూడు సార్లు కొట్టి అబ్రకదబ్ర అని గట్టిగా అరిచి వేగంగా తిరిగి వెళ్లిపో’ అని బాలుడు రాసుకొచ్చాడు. సహజంగా ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోరు. కానీ.. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన మహిళ మాత్రం బాలుడు చెప్పిన విధంగానే చేసింది. అమెజాన్ డెలివరీ మహిళ బాలుడు చెప్పిన విధంగా చేయడం ఇంటి ముందున్న కెమెరాలో రికార్డ్ అయింది. బాలుడి మహిళ ఈ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. అంతేకాకుండా తన కొడుకు చేసిన పనికి ఆమె క్షమాపణలు కూడా తెలిపింది. మరోపక్క ఈ వీడియోపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. డెలివరీ మహిళను ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Updated Date - 2020-06-26T05:35:23+05:30 IST