అమెరికాలో కొవిడ్ విజృంభణ.. ఒక్కరోజే !

ABN , First Publish Date - 2020-11-07T22:05:12+05:30 IST

అమెరికాలో ఒకవైపు అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగుతుంటే.. మరోవైపు మహమ్మారి కరోనావైరస్ విజృంభిస్తోంది.

అమెరికాలో కొవిడ్ విజృంభణ.. ఒక్కరోజే !

వాషింగ్టన్: అమెరికాలో ఒకవైపు అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగుతుంటే.. మరోవైపు మహమ్మారి కరోనావైరస్ విజృంభిస్తోంది. గడిచిన మూడురోజుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 1,27,000పైగా కేసులు నమోదైనట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. అలాగే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,149 మంది ఈ మహమ్మారికి బలైనట్లు తెలిపింది. దేశంలో కొవిడ్ ప్రభావం ప్రారంభదశతో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ గత నాలుగు రోజులుగా వెయ్యికి పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే విషయం. ఇక ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవించిన దేశంగా యూఎస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 9.7 మిలియన్లకు పైగా మందికి కరోనా సోకగా... 2.36 లక్షల మంది మరణించారు. కాగా, డిసెంబర్‌లోగా కొవిడ్ వ్యాక్సిన్‌పై పూర్తి సమాచారం తెలుస్తుందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఇటీవల వెల్లడించారు. కనుక వచ్చే ఏడాది జనవరి వరకు అమెరికాలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఎస్‌కు చెందిన మోడెర్నా, ఫైజర్ అత్యావసర వినియోగానికి సంబంధించి దరఖాస్తుకు సిద్ధమైన్నట్లు సమాచారం.         

Updated Date - 2020-11-07T22:05:12+05:30 IST