యూకేలో పది లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-01T05:19:48+05:30 IST

యూకేలో శనివారం దాదాపు 22 వేల కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో న

యూకేలో పది లక్షలు దాటిన కరోనా కేసులు

లండన్: యూకేలో శనివారం దాదాపు 22 వేల కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో యూకేలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 10,11,660కు చేరుకుంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 326 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 46,555గా ఉంది. యూకేలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదలుకావడంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ కరోనా నిబంధనలను అమలు చేస్తోంది. 


అంతేకాకుండా భారత్‌లో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల కింద ప్రాంతాలను ఏ విధంగా విడతీశారో.. యూకేలోనూ మూడు రిస్క్ స్థాయిల కింద ప్రాంతాలను విభజించారు. హైరిస్క్‌గా ప్రకటించిన ప్రాంతంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే క్రిస్ట్‌మస్ రానుండటంతో అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తమవుతున్నారు. యూకే ప్రధాని బోరిస్ ప్రధాని మరోమారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

Read more