యూకేలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-10-14T04:36:54+05:30 IST

యూకేలో గడిచిన 24 గంటల్లో 143 మంది కరోనా బారిన పడి మరణించినట్టు

యూకేలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

లండన్: యూకేలో గడిచిన 24 గంటల్లో 143 మంది కరోనా బారిన పడి మరణించినట్టు అధికారులు వెల్లడించారు. జూన్ నెల నుంచి ఒకేరోజు ఇంత మంది మృతిచెందడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. 143 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 43,018కు చేరుకుంది. మరోపక్క ఒకేరోజు 17,234 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 6,34,920గా ఉంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మూడు దశల(త్రీ లెవల్) సిస్టమ్‌ను అమలులోకి తీసుకొచ్చినట్టు ఇటీవలే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. మీడియమ్, హై, వెరీ హై రిస్క్ దశలుగా వీటికి పేర్లు పెట్టారు. ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాలు కూడా మీడియమ్ రిస్క్ ప్రాంతాలుగానే ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. లివర్‌పూల్ నగరాన్ని మాత్రమే హై రిస్క్ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. హై రిస్క్‌గా ప్రకటించిన నగరంలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, క్యాసినోలు తదితర వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేయనున్నారు. 

Updated Date - 2020-10-14T04:36:54+05:30 IST