లైవ్‌లో చిన్నారి అల్లరి.. యాంకర్ పేరు ఏంటంటూ..!
ABN , First Publish Date - 2020-07-03T04:46:08+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. కాగా.. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగుల బాధలు కళ్లకు కట్టినట్లు చూపే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. కాగా.. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగుల బాధలు కళ్లకు కట్టినట్లు చూపే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ క్లేర్ వెన్హామ్ను బీబీసీ చానల్ ఇంటర్యూ చేసింది. ఇంటర్యూలో భాగంగా ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రశ్నను యాంకర్.. డాక్టర్ క్లేర్ వెన్హామ్ను అడిగారు. యాంకర్ ప్రశ్నకు క్లేర్ వెన్హామ్ బదులిస్తున్న సమయంలో.. క్లేర్ వెన్హామ్ కూతురు, వారి సంభాషణ మధ్యలోకి దూరిపోయింది. అంతేకాకుండా తాను పట్టుకొచ్చిన పెయింటింగ్‌ను ఎక్కడ పెట్టాలంటూ ఆ చిన్నారి క్లేర్ వెన్హామ్ను పదే పదే ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కూతురు సమాధానం చెప్తూనే.. క్లేర్ వెన్హామ్, యాంకర్‌కు బదులిచ్చారు. క్లేర్ వెన్హామ్ గారాలపట్టి అంతటితో ఆగలేదు. యాంకర్ పేరు ఏంటి? అంటూ.. క్లేర్ వెన్హామ్ను ప్రశ్నించింది. ఆ దృశ్యాలను బీబీసీ అలానే ప్రసారం చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.