బ్రిటన్ కీలక నిర్ణయం.. భారతీయులకు చేకూరనున్న లబ్ధి!
ABN , First Publish Date - 2020-03-25T23:36:39+05:30 IST
కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ప్ర

లండన్: కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. అయితే ప్రయాణ ఆంక్షల కారణంగా బ్రిటన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గడువు ముగిసిన.. ముగియబోతున్న వీసాల గడువును మే 31వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 24 తరువాత.. సెల్ఫ్ ఐసోలేష్, ప్రయాణ నిబంధనల కారణంగా దేశం విడిచి వెళ్లని వారి వీసా గడువును మే 31 వరకు పొడగిస్తున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు బ్రిటన్ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎవరినీ శిక్షించదని వ్యాఖ్యానించారు. కాగా.. బ్రిటన్ నిర్ణయం వల్ల భారతీయులతోపాటు, ఇతర దేశాల పౌరులకు కూడా లబ్ధి చేకూరనుంది.