విదేశీ డాక్టర్ల వీసాల గడువు పెంపు... యూకే సర్కారు ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-01T19:17:19+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్ననేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ దేశంలో పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన డాక్టర్ల వీసా గడువును ఏడాది కాలం పాటు పెంచుతూ బ్రిటన్ సర్కారు...

విదేశీ డాక్టర్ల వీసాల గడువు పెంపు... యూకే సర్కారు ఆదేశాలు

లండన్ : కరోనా వైరస్ ప్రబలుతున్ననేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ దేశంలో పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన డాక్టర్ల వీసా గడువును ఏడాది కాలం పాటు పెంచుతూ బ్రిటన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం యూకేలో వైద్యుల అవసరం ఉన్నందున ఈ ఏడాది అక్టోబరుతో ముగిసే డాక్టర్ల వీసాల గడువును ఏడాది పాటు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మన భారతదేశానికి చెందిన వైద్యులు కూడా యూకేలోనే మరో ఏడాది పాటు వైద్యసేవలు అందించనున్నారు. 

Updated Date - 2020-04-01T19:17:19+05:30 IST