యూఏఈలో స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు !
ABN , First Publish Date - 2020-08-20T16:15:48+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న యూఏఈలో బుధవారం కొత్త కేసులు స్పల్పంగా పెరిగాయి.

యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న యూఏఈలో బుధవారం కొత్త కేసులు స్పల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన 72వేల కోవిడ్ టెస్టుల్లో 435 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. ఇక ఇప్పటికే యూఏఈ ఆరు మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. కాగా, నిన్న నమోదైన 435 కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 65,341కు చేరింది. అలాగే 113 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 58,022 అయ్యాయి. ఇప్పటివరకు యూఏఈలో 367 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి.