యూఏఈలో కొనసాగుతున్న కొవిడ్ విలయం !
ABN , First Publish Date - 2020-12-20T13:11:13+05:30 IST
యూఏఈలో మహమ్మారి కొవిడ్-19 విలయం కొనసాగుతోంది.

అబుధాబి: యూఏఈలో మహమ్మారి కొవిడ్-19 విలయం కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 1,36,132 కరోనా పరీక్షల్లో 1,254 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1,92,404కు చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 823 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశార్జి కావడంతో మొత్తం రికవరీలు 1,68,129కు చేరాయి. శనివారం సంభవించిన నాలుగు మరణాలతో కలిపి ఇప్పటివరకు వైరస్‌కు బలైన వారు 634 మంది అయ్యారు. ప్రస్తుతం దేశంలో 23,641 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న యూఏఈ సర్కార్ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఏకంగా 19 మిలియన్లకు పైగా కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ఇక డిసెంబర్ 9న చైనాకు చెందిన కొవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్‌కు యూఏఈ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.