యూఏఈలో 5.6 మిలియన్ల కోవిడ్ టెస్టులు !
ABN , First Publish Date - 2020-08-12T17:14:01+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి కోలుకుంటున్న యూఏఈ కరోనా నిర్ధారణ పరీక్షల్లో దూసుకెళ్తోంది.

యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి కోలుకుంటున్న యూఏఈ కరోనా నిర్ధారణ పరీక్షల్లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 5.6 మిలియన్ల కోవిడ్ టెస్టులు పూర్తి చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు ఆరు మిలియన్ల కరోనా పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. విరివిగా కోవిడ్ టెస్టులు చేయడం వల్లే ప్రస్తుతం దేశంలో ఈ మహమ్మారి అదుపులో ఉందని తెలియజేశారు. పాజిటివ్ కేసులు తగ్గడంతో పాటు కోలుకుంటున్నవారి సంఖ్య అంతకంతకు పెరగడంతో రికవరీ రేటు 92 శాతానికి చేరింది. అటు మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది.
ఇక మంగళవారం యూఏఈలో 262 కొత్త కేసులు నమోదైతే... 195 రికవరీలు నమోదయ్యాయి. అలాగే ఒక మరణం సంభవించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 62,966కు చేరితే... మొత్తం రికవరీలు 56,961 అయ్యాయి. ఇప్పటికే 358 మందిని కరోనా బలిగొంది. ప్రస్తుతం దేశంలో 5,647 యాక్టివ్ కేసులు ఉన్నాయి.