యూఏఈలో కొవిడ్ ఉధృతి.. 12 మిలియన్లకు చేరువలో కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-19T14:22:58+05:30 IST

యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 115,293 కొవిడ్ టెస్టుల్లో 1,215 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

యూఏఈలో కొవిడ్ ఉధృతి.. 12 మిలియన్లకు చేరువలో కరోనా పరీక్షలు

అబుధాబి: యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 115,293 కొవిడ్ టెస్టుల్లో 1,215 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,15,602కు చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 1,162 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,07,516కు చేరాయి. ఆదివారం నాలుగు కరోనా మరణాలు సంభవిచండంతో మొత్తం మృతుల సంఖ్య 463కు చేరింది. ప్రస్తుతం దేశంలో 7,623 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


మరోవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 11.7 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. దీంతో దేశ జనాభా కంటే అధికంగా కరోనా పరీక్షలు నిర్వహించిన దేశంగా యూఏఈ రికార్డుకెక్కింది. ప్రస్తుతం యూఏఈలో రెండు వ్యాక్సిన్లు ట్రయల్ దశలో ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది మంత్రులు ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు యూఏఈ సాంస్కృతిక, యువ అభివృద్ధి శాఖ మంత్రి నౌరా అల్ కాబీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-19T14:22:58+05:30 IST