వీసా గడువు ముగిసిన సందర్శకులకు యూఏఈ గుడ్న్యూస్ !
ABN , First Publish Date - 2020-08-11T14:55:01+05:30 IST
వీసా గడువు ముగిసిన సందర్శకులకు యూఏఈ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది.

యూఏఈ: వీసా గడువు ముగిసిన సందర్శకులకు యూఏఈ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. మార్చి 1 తర్వాత సందర్శన లేదా పర్యాటక వీసాల గడువు ముగిసిన వారికి మరో నెల రోజుల పాటు ఎలాంటి జరిమానా చెల్లించకుండా దేశం విడిచిపెట్టి వెళ్లే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సోమవారం యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పొడిగింపు ఆగస్టు 11 నుండి ప్రారంభమవుతుందని తన ప్రకటనలో పేర్కొంది. మార్చి 1 తర్వాత గడువు ముగిసిన యూఏఈ సందర్శన లేదా పర్యాటక వీసాలు కలిగిన వారు జూలై 11, 2020 నుండి ఆగస్టు 11 నాటికి ఒక నెలలోపు యూఏఈ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నెల రోజుల కాలానికి గాను ఎలాంటి జరిమానాలు విధించబోమని సంబంధిత అధికారులు వెల్లడించారు.