యూఏఈలో ఒక్కరోజే 781కేసులు..!

ABN , First Publish Date - 2020-05-11T15:58:33+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోనూ కొవిడ్-19 విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ

యూఏఈలో ఒక్కరోజే 781కేసులు..!

యూఏఈ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలోనూ కొవిడ్-19 విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆరోగ్యశాక అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం.. యూఏఈలో ఆదివారం ఒక్కరోజే 781మంది కరోనా బారినపడ్డారు. 509మంది మహమ్మారి నుంచి కోలుగకోగా.. 13 మంది మృతి చెందారు. యూఏఈ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 29వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రోజు నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు యూఏఈలో 18,198 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 4,804 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. మరణించిన వారి సంఖ్య 198కి చేరింది. కాగా.. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 


Updated Date - 2020-05-11T15:58:33+05:30 IST