ముక్కులోని ఆ రెండు కణాలే 'కొవిడ్‌-19' ఎంట్రీ పాయింట్స్‌

ABN , First Publish Date - 2020-04-26T13:46:36+05:30 IST

ముక్కులోని రెండు రకాల కణాలు ప్రధానంగా కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమవుతున్నాయని భావిస్తున్నట్లు యూకేలోని వెల్‌కమ్‌ సంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ గ్రోనింన్జన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

ముక్కులోని ఆ రెండు కణాలే 'కొవిడ్‌-19' ఎంట్రీ పాయింట్స్‌

లండన్‌, ఏప్రిల్‌ 25: ముక్కులోని రెండు రకాల కణాలు ప్రధానంగా కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమవుతున్నాయని భావిస్తున్నట్లు యూకేలోని వెల్‌కమ్‌ సంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ గ్రోనింన్జన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ముక్కులోని గోబ్లెటె, సిలియేటెడ్‌ కణాల్లో ఎంట్రీ ప్రొటీన్స్‌ ఉంటాయని, వీటితోనే వైరస్‌ ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. సిలియేటెడ్‌ కణాలు వెంట్రుకపాటి ఉంటాయి. గిన్నె ఆకారంలో గోబ్లెట్‌ కణాలు ఉంటాయి. ఈ రెండూ కరోనాను వ్యాప్తి చేసే రేటు అధికమని నేచుర్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ఓ వ్యాసం ప్రచురితమైంది.  

Updated Date - 2020-04-26T13:46:36+05:30 IST