బహ్రెయిన్‌లో ఇద్దరు భారతీయ నర్సులకు 'కరోనా'

ABN , First Publish Date - 2020-03-13T15:01:43+05:30 IST

బహ్రెయిన్‌లో మరో ఇద్దరు భారతీయ నర్సులు కరోనావైరస్(కొవిడ్-19) బారినపడ్డారు.

బహ్రెయిన్‌లో ఇద్దరు భారతీయ నర్సులకు 'కరోనా'

మనామా: బహ్రెయిన్‌లో మరో ఇద్దరు భారతీయ నర్సులు కరోనావైరస్(కొవిడ్-19) బారినపడ్డారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కసారగాడ్‌కు చెందిన ఇద్దరు నర్సులు బహ్రెయిన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారిద్దరిని వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నర్సులు కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరితో కలిపి బహ్రెయిన్‌లో కరోనా బారినపడ్డ భారతీయ నర్సుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, బహ్రెయిన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 195కి చేరాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1.26 లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 4,600 మంది మృత్యువాత పడ్డారు. 


Updated Date - 2020-03-13T15:01:43+05:30 IST