అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం..!

ABN , First Publish Date - 2020-09-20T12:07:32+05:30 IST

అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు.

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం..!

రోచెస్టర్‌, సెప్టెంబరు 19: అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఓ పార్టీలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒక యువకుడు (18), ఒక యువతి (22) ఉన్నారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంతమంది కాల్పులు జరిపారో ఇంకా నిర్ధారణ కాలేదని, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

Updated Date - 2020-09-20T12:07:32+05:30 IST