ఉద్యోగుల విష‌యంలో ట్విట్ట‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ABN , First Publish Date - 2020-05-13T14:03:56+05:30 IST

కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంచలన ప్రకటన జారీ చేసింది.

ఉద్యోగుల విష‌యంలో ట్విట్ట‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

కాలిఫోర్నియా (అమెరికా): కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంచలన ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ఇక తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీల బాటలో పయనించిన ట్విట్టర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించింది. ప్రస్థుత కరోనా సంక్షోభం ముగిశాక కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని ట్విట్టర్ వెల్లడించింది. ప్రస్థుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు, దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని కోరడంతో దాన్ని అనుమతించామని కంపెనీ తెలిపింది. సెప్టెంబరు నెల వరకు తమ కార్యాలయాలను తెరిచేది లేదని ట్విట్టర్ వివరించింది. 


Read more