ట్రంప్‌కు మరోసారి షాకిచ్చిన ట్విట్టర్ !

ABN , First Publish Date - 2020-10-27T23:51:09+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ మరోసారి షాకిచ్చింది. ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌పై సోమవారం రాత్రి ట్రంప్ చేసిన ట్వీట్‌ను తొలగించింది.

ట్రంప్‌కు మరోసారి షాకిచ్చిన ట్విట్టర్ !

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ మరోసారి షాకిచ్చింది. ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌పై సోమవారం రాత్రి ట్రంప్ చేసిన ట్వీట్‌ను తొలగించింది. "మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వల్ల అమెరికా అంతటా సమస్యలు, వ్యత్యాసాలు ఉన్నాయి. ఫైనల్ ఓట్ ట్యాలీ ఆన్ ఎలక్షన్ డే" అని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, అధ్యక్షుడు తన వాదనలకు ఎలాంటి రుజువు లేకుండా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియా సంస్థ ఈ ట్వీట్‌ను తొలగించింది. అంతేకాకుండా ఈ పోస్టును తొలగించడానికి గల కారణాన్ని కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వివరించింది. "ఈ ట్వీట్‌లో భాగస్వామ్యం చేయబడిన కొన్ని లేదా మొత్తం కంటెంట్ వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలలో లేదా మరొక పౌర ప్రక్రియలో ఎలా పాల్గొనాలనే దాని గురించి తప్పుదారి పట్టించవచ్చు." అని ట్విట్టర్ పేర్కొంది. అందుకే ఈ పోస్టును తొలిగించినట్లు తెలిపింది. ఇక ఇప్పటికే ట్రంప్ పలుమార్లు మెయిల్ ఇన్ ఓటింగ్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. డెమొక్రాట్లు ఎన్నికల్లో గెలవడానికే మెయిల్ ఇన్ ఓటింగ్‌‌పై ఆసక్తి కనబరుస్తున్నారని కూడా ఆరోపించారు. 

Updated Date - 2020-10-27T23:51:09+05:30 IST