రెండు నెలల్లో మొదటిసారి తగ్గిన మరణాల సంఖ్య.. టర్కీలో..

ABN , First Publish Date - 2020-05-17T09:36:28+05:30 IST

టర్కీలో గడిచిన 24 గంటల్లో 41 మంది కరోనా కారణంగా మరణించారని

రెండు నెలల్లో మొదటిసారి తగ్గిన మరణాల సంఖ్య.. టర్కీలో..

అంకారా: టర్కీలో గడిచిన 24 గంటల్లో 41 మంది కరోనా కారణంగా మరణించారని ఆరోగ్యశాఖ మంత్రి ఫారెట్టిన్ కోకా తెలిపారు. మార్చి చివరి నుంచి ఇప్పటివరకు మరణాల రేటు చూస్తే.. ఇది అతి తక్కువని ఆయన చెప్పారు. టర్కీలో ఇప్పటివరకు 1,48,067 కేసులు నమోదు కాగా.. 4,096 మంది మరణించారు. కరోనా సోకిన వారిలో లక్షా 8 వేలకు పైగా పూర్తిగా కోలుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు టర్కీ ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్‌లను విధించుకుంటూ వెళ్తోంది. ఇస్థాంబుల్‌తో కలిపి 15 ప్రావిన్స్‌లలో ప్రస్తుతం నాలుగు రోజుల లాక్‌డౌన్ నడుస్తోంది. కొన్ని ప్రావిన్స్‌లలో వీకెండ్, నేషనల్ హాలిడే రోజుల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. మరోపక్క 20 కంటే తక్కువ, 65 కంటే ఎక్కువ వయసున్న వారిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వం అనుమతిచ్చిన రోజుల్లో మాత్రమే వారు బయటకు రావాల్సి ఉంటుంది. టర్కీలో ఇప్పటికే మాల్స్, బార్బర్ దుకాణాలు తదితర వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. మే 28 నుంచి దేశంలో పర్యాటక రంగాన్ని కూడా ప్రారంభించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి నూరి ఎర్సోయ్ తెలిపారు. 

Updated Date - 2020-05-17T09:36:28+05:30 IST