గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: నామా నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2020-12-15T13:19:13+05:30 IST

గల్ఫ్‌కు తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికులు అక్కడ ఎదుర్కొంటోన్న సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: నామా నాగేశ్వరరావు

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌కు తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికులు అక్కడ ఎదుర్కొంటోన్న సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకువెళతానని చెప్పారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నకిలీ ఎజెంట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వలసదారుల హక్కులు, సంక్షేమ ఫోరం ప్రతినిధులతో కలిసి ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు సోమవారం నామా నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడారు. గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చిన వారికి ఉపాధి కల్పించడంతో పాటు బాధితులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు. 


Updated Date - 2020-12-15T13:19:13+05:30 IST