కరోనా వ్యాక్సిన్‌ ముందు మాకే.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం

ABN , First Publish Date - 2020-12-10T10:27:44+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో తొలుత అమెరికన్లకే ప్రాధాన్యమిచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు.

కరోనా వ్యాక్సిన్‌ ముందు మాకే.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం

వాషింగ్టన్‌, డిసెంబరు 9: కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో తొలుత అమెరికన్లకే ప్రాధాన్యమిచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్‌ అందిన తర్వాతే, విదేశాలకు పంపిణీ చేయడంపై దృష్టిసారిస్తామన్నారు. బుధవారం వైట్‌హౌ్‌సలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్‌ కంపెనీలకు రూ.లక్ష కోట్ల ఆర్థికసాయాన్ని అందించి ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’ను తాను చేపట్టినందు వల్లే ఇంత త్వరగా ఫైజర్‌, మోడెర్నా టీకాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇక కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తాను పదవిని చేపట్టిన తొలి 100 రోజుల్లోగా 10 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేస్తానని ప్రకటించారు. 

Updated Date - 2020-12-10T10:27:44+05:30 IST