వైట్‌హౌస్‌ బ‌య‌ట కాల్పుల క‌ల‌క‌లం !

ABN , First Publish Date - 2020-08-11T14:08:30+05:30 IST

అమెరికాలోని వైట్ హౌస్ వెలుపల కాల్పులు చోటుచేసుకున్నాయి.

వైట్‌హౌస్‌ బ‌య‌ట కాల్పుల క‌ల‌క‌లం !

వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వైట్ హౌస్ వెలుపల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వ‌యంగా తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంద‌ని, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు చేప‌ట్టార‌న్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన‌ వ్యక్తి ఎదురు కాల్పుల‌లో గాయ‌ప‌డ‌గా, అత‌నిని ఆసుపత్రికి తరలించార‌ని తెలిపారు. ఈ ఉదంతంలో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన‌ సీక్రెట్ సర్వీస్ అధికారులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. కాల్పుల సంఘటనను యూఎస్ సీక్రెట్ సర్వీస్ ధృవీకరించింది. 

Updated Date - 2020-08-11T14:08:30+05:30 IST