సిరియా అధ్యక్షుడిని హతమార్చాలనుకున్నా: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-09-17T14:54:34+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన విషయాలు బయటపెట్టాడు. 2017లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ను

సిరియా అధ్యక్షుడిని హతమార్చాలనుకున్నా: ట్రంప్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 16: అమెరికా అధ్యక్ష ఎన్నికలు  సమీపిస్తున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన విషయాలు బయటపెట్టాడు. 2017లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ను హతమార్చడానికి ఆదేశించాలని అనుకున్నానని, అయితే అప్పటి రక్షణ  కార్యదర్శి జేమ్స్‌ మ్యాటీస్‌ వ్యతిరేకించడంతో విరమించుకున్నానని అన్నారు. కాగా, మరో మూడు నాలుగు వారాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావొచ్చని ఏబీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-17T14:54:34+05:30 IST