నిత్యం కరోనా పరీక్ష చేయించుకుంటూనే ఉంటా: ట్రంప్

ABN , First Publish Date - 2020-04-07T20:46:16+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. అమెరికాలో మరణించిన వారి

నిత్యం కరోనా పరీక్ష చేయించుకుంటూనే ఉంటా: ట్రంప్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. అమెరికాలో మరణించిన వారి సంఖ్య పది వేలు దాటడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా వ్యాప్తంగా 3,68,449 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 10,943 మంది మృతిచెందారు. ఇదిలా ఉండగా.. తాను, ఇతర సిబ్బంది నిత్యం కరోనా పరీక్ష చేయించుకుంటూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం కరోనా పరీక్షకు పెద్దగా సమయం కూడా పట్టడం లేదని, సులభంగా అయిపోతోందని ఆయన అన్నారు. తాజాగా ట్రంప్ రెండు సార్లు కరోనా పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్ వచ్చింది. అనేక దేశాధినేతలకు కరోనా సోకుతుండటంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా సోమవారం మరోమారు కరోనా పరీక్ష చేయించుకున్నట్టు తెలిపారు.

Read more