ట్రంప్‌ రీట్వీట్‌ వీడియో తొలగింపు

ABN , First Publish Date - 2020-07-20T14:13:40+05:30 IST

ఎన్నికల ప్రచారానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రీట్వీట్‌ చేసిన ఓ వీడియోను ట్విటర్‌ సంస్థ తొలగించింది. ఆ వీడియోలో తమ కంపెనీకి చెందిన ఆడియోను వాడారంటూ లింకిన్‌ పార్క్‌ అనే సంస్థ కాపీరైట్‌ నోటీసు...

ట్రంప్‌ రీట్వీట్‌ వీడియో తొలగింపు

  • కాపీరైట్‌ నోటీసుతో ట్విటర్‌ చర్య


వాషింగ్టన్‌, జూలై 19 : ఎన్నికల ప్రచారానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రీట్వీట్‌ చేసిన ఓ వీడియోను ట్విటర్‌ సంస్థ తొలగించింది. ఆ వీడియోలో తమ కంపెనీకి చెందిన ఆడియోను వాడారంటూ లింకిన్‌ పార్క్‌ అనే సంస్థ కాపీరైట్‌ నోటీసు ఇచ్చిన దరిమిలా ట్విటర్‌ చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారంపై శ్వేతసౌధం తాజాగా రూపొందించిన ఆ వీడియోను.. వైట్‌హౌస్‌ సోషల్‌ మీడియా డైరెక్టర్‌ డాన్‌ స్వావినో ట్విటర్‌లో పోస్టు చేశారు. దానినే ట్రంప్‌ రీట్వీట్‌ చేశారు.  


Updated Date - 2020-07-20T14:13:40+05:30 IST