ట్రంప్‌ ఆశలు గల్లంతు

ABN , First Publish Date - 2020-12-13T11:56:44+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ టెక్స్‌సకు

ట్రంప్‌ ఆశలు గల్లంతు

  • అధ్యక్ష ఎన్నికల ఫలితాల నిలుపుదలకు అమెరికా సుప్రీంకోర్టు నిరాకరణ
  • సుప్రీంకోర్టుకు బుద్ధి లేదు: ట్రంప్‌

వాషింగ్టన్‌, డిసెంబరు 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ టెక్స్‌సకు చెందిన రిపబ్లికన్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించేందుకు అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలిచిన జార్జియా, మిషిగన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్లు వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ రాష్ట్రాల్లో చట్టాలు, రాజ్యాంగ నిబంధనలను డెమొక్రాట్లు ఉల్లంఘించారని వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ సామ్యూల్‌ అలిటో, జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ తీర్పు ఇచ్చారు. దీంతో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్‌ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. కోర్టు తీర్పు తమను ఎంతో నిరాశకు గురిచేసిందని, కోర్టుకు బుద్ధి లేదని, ధైర్యం లేదని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పు అమెరికాకు అవమానకరమని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-13T11:56:44+05:30 IST